ఎపి అసెంబ్లీ ఎన్నికల కసరత్తు – ఈసీ సమీక్ష

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో … భాగంగా ఎపి రాష్ట్రానికి వచ్చిన ఏడుగురు అధికారుల ఈసీ బృందం.. విజయవాడలోని నోవాటెల్‌ హౌటల్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024తో పాటు, రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ భేటీ అవుతుంది.ఓటర్ల జాబితా అంశంతో పాటు ఎన్నికల సన్నాహాకాలపైనా ఈ సమావేశంలో అధికారులు చర్చించనున్నారు.

నేడు, రేపు జరగనున్న ఈ సమీక్షలో … ఈసీ బృందానికి నేడు ఎన్నికల సన్నద్దతపై కలెక్టర్లు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఒక్కొక్క జిల్లా కలెక్టర్‌ ఎన్నికల సన్నద్దతపై 15 నిమిషాల పాటు ఈసీ బఅందానికి వివరించనున్నారు. ఆపై జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై నివేదికలు సమర్పించనున్నారు. ఈరోజు 18 జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సమీక్ష కొనసాగనుంది. మిగిలిన ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేపు(శనివారం) పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి ముకేష్‌ కుమార్‌ మీనా పాల్గొన్నారు.

➡️