మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Dec 15,2023 08:14 #bosta satyanarayana, #press meet

– 18 నుంచి టెన్త్‌

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి బొత్స

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి ఒకటి నుంచి జరుగుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రెండు పరీక్షల షెడ్యూల్‌ను విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. వొకేషనల్‌ కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు జరుగుతాయి. నైతిక, మానవ విలువల సబ్జెక్టు ఫిబ్రవరి 2న, పర్యావరణ విద్య సబ్జెక్టు ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుంది. సమగ్ర శిక్షా వొకేషనల్‌ ట్రేడ్‌ ఎగ్జామినేషన్‌ ఫిబ్రవరి 22న జరగనుంది. మార్చి 18 నుంచి 30 వరకు 6 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి బత్స చెప్పారు. మాల్‌ ప్రాక్టీస్‌కు తావు లేకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. డిసెంబరు 21న 8వ తరగతి చదువుతున్న 4.35 లక్షల మంది విద్యార్థులకు ట్యాబులను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌, సమగ్ర శిక్షా డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టైం టేబుల్‌

ఇంటర్‌      మొదటి సంవత్సరం  తేది సబ్జెక్ట్‌

1-03-2024 సెకండ్‌ లాంగ్వెజ్‌ పేపర్‌1(శుక్రవారం)

4-03-2024(సోమవారం) ఇంగ్లీష్‌ పేపర్‌1

06-03-2024 మేథమెటిక్స్‌ పేపర్‌1ఎ(బుధవారం)

బోటనీ పేపర్‌1 సివిక్స్‌ పేపర్‌1

9-03-2024 మేథమెటిక్స్‌ పేపర్‌1బి (శనివారం)

జువాలజీ పేపర్‌1

హిస్టరీ పేపర్‌1

12-03-2024ఫిజిక్స్‌ పేపర్‌1(మంగళవారం)

ఎకనామిక్స్‌ పేపర్‌1 14-03-2024 కెమిస్ట్రీ పేపర్‌1(గురువారం)

కామర్స్‌ పేపర్‌1 సోసియాలజీ పేపర్‌1

ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌1 16-03-2024(శనివారం)

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ పేపర్‌1

లాజిక్‌ పేపర్‌1 బ్రిడ్జ్‌ కోర్సు

మేథ్స్‌ పేపర్‌119-04-2024

మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌1(సోమవారం)

జియోగ్రఫీ పేపర్‌1

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తేది సబ్జెక్ట్‌

02-03-2024 సెకెండ్‌ లాంగ్వెజ్‌ పేపర్‌2(శనివారం)

05-03-2024(మంగళవారం)ఇంగ్లీష్‌ పేపర్‌2

07-03-2024 మేథమెటిక్స్‌ పేపర్‌2ఎ(గురువారం)

బోటనీ పేపర్‌2

సివిక్స్‌ పేపర్‌

2 11-03- 2024 మేథమెటిక్స్‌ పేపర్‌2బి (సోమవారం)

జువాలజీ పేపర్‌2 హిస్టరీ పేపర్‌

213-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌2(బుధవారం)

ఎకనామిక్స్‌ పేపర్‌

2 15-03-2024

కెమిస్ట్రీ పేపర్‌2(శుక్రవారం)

కామర్స్‌ పేపర్‌2

సోసియాలజీ పేపర్‌2

ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌

218-03-2024 (సోమవారం)

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ పేపర్‌2

లాజిక్‌ పేపర్‌2 బ్రిడ్జ్‌ కోర్సు

మాథ్స్‌ పేపర్‌2

20-03-2024 మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2(శనివారం)

జియోగ్రఫీ పేపర్‌2

పదో తరగతి షెడ్యూల్‌తేది సబ్జెక్ట్‌

18-03-2024 మొదటి భాష(సోమవారం) (పేపర్‌1)

19-03-2024 రెండవ భాష(మంగళవారం)

20-03-2024 ఇంగ్లీష్‌(బుధవారం)

22-03-2024 మేథమెటిక్స్‌(శుక్రవారం

23-03-2024 ఫిజికల్‌ సైన్స్‌(శనివారం)

26-03-2024 బయోలాజికల్‌ సైన్స్‌(మంగళవారం)

27-03-2024 సోషల్‌ స్టడీస్‌(బుధవారం)

28-03-2024 ప్రథమ భాష పేపర్‌2(గురువారం) (కంపొజిట్‌కోర్సు) ఒఎస్‌ఎస్‌సి మెయిన్‌ ల్యాంగ్వేజ్‌-1

30-03-2024 ఒఎస్‌ఎస్‌సి మెయిన్‌ ల్యాంగ్వేజ్‌-2(శనివారం) ఎస్‌ఎస్‌సి వొకేషనల్‌ కోర్సు

 

➡️