హాఫ్‌ డే ఉత్తర్వులు వెనక్కితీసుకున్న ఢిల్లీ ఎయిమ్స్‌

Jan 22,2024 08:02 #AIIMS Hospital, #am Temple Event

న్యూఢిల్లీ :   అయోధ్య కార్యక్రమం సందర్భంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్‌ క్రిటికల్‌ సర్వీస్‌లను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ ఆదివారం వెనక్కి తీసుకుంది. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవుట్‌ పేషెంట్‌ విభాగం సేవలు కొనసాగుతాయని అధికారిక ప్రకటనలో ఎయిమ్స్‌ పేర్కొంది. జనవరి 22న హాఫ్‌ డే ప్రకటిస్తూ శనివారం ఎయిమ్స్‌ ఢిల్లీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆస్పత్రిని మూసివేస్తామని తెలిపింది. అత్యవసర విభాగాల సేవలు కొనసాగుతాయని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి తెలిపారు. అయితే ఎయిమ్స్‌ హాఫ్‌ డే నిర్ణయంపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

అపాయింట్‌ మెంట్‌ కోసం రోగులు వారాలు, కొన్ని సార్లు నెలలు వేచి ఉంటారని, ఇప్పుడు అకస్మాత్తుగా ఒపిడి సేవలను నిలిపివేయడం వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుందని నోటిఫికేషన్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. ” హలో ప్రజలారా.. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 22న మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తేలా చేయకండి. రాముడిని స్వాగతించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ 2 గంటల వరకు సమయాన్ని కేటాయించింది. రోగులు అందుకని మీరు 2 గంటల తరువాత షెడ్యూల్‌ చేయండి” అని శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే తనను స్వాగతించడానికి ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగిందని రాముడు అంగికరిస్తారా అని విస్మయం కలుగుతోందని అన్నారు.

వైద్యుల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రజలు ఎయిమ్స్‌ గేట్ల వద్ద చలిలో పడిగాపులు పడుతుందటారనితఅణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి సాకేత్‌ గోఖలే ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కెమెరాలకు, ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుంటే.. రోగులు అత్యవసర సేవల కోం వేచిచూడాలా అని ధ్వజమెత్తారు.

➡️