జనవరి 10న వాకౌట్ సమ్మె జయప్రదం చేయాలి

Dec 20,2023 16:18 #Krishna district
aiiea protest call

జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎల్ ఐ సి ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై జనవరి 10 వ తేదీన జరిగే ఒక గంట వకౌట్ సమ్మె లో ఉద్ ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపు నిచ్చారు.ఆగస్టు 1, 2022 నుండి జరగవలసిన వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించాలని; నూతన పెన్షన్ స్కీం క్రింద కవర్ అవుతున్న ఉద్యోగులకు యాజమాన్యం చెల్లించే కాంట్రిబ్యూషన్ ను 10 నుండి 14 శాతానికి పెంచాలని; అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టాలని ఉద్యోగులు మరియు అధికారుల సమస్యలపై యాజమాన్యం యొక్క ఏకపక్ష వైఖరిని విడనాడాలని డిమాండ్ ల పరిష్కారానికి ఎల్ ఐ సిలోని ఉద్యోగ సంఘాలైన ఫెడరేషన్ ఆఫ్ క్లాస్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా ఎఎల్ ఐ సి ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ ఫ్రంట్ గా ఏర్పడి ఎల్ ఐ సిలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ డిమాండ్లపై 2024, జనవరి 10వ తేదీన ఒక గంట వాకౌట్ సమ్మెకు పిలుపు నివ్వడం జరిగిందన్నారు.
ఈ సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా వివిధ ఉద్యోగ సంఘాలతో కూడిన జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎల్ ఐ సి డివిజనల్ కార్యాలయం వద్ద బోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ మరియు డిమాన్ స్ట్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జె. సుధాకర్, జి. కిషోర్ కుమార్, టి. చంద్రపాల్, ఎల్. రాజశేఖర్, వి.ఆర్. ఎన్. ఠాగూర్, కె.వి. దుర్గా ప్రసాద్, వి. శ్రీనివాస్, ఎస్. దిలీప్ మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు బిహెచ్.వి.ఎల్. రాధాకృష్ణ మూర్తి, ఎస్. ధనుంజయ రావు తదితరులు నాయకత్వం వహించగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️