జపాన్‌లో భారీ భూకంపం

Apr 2,2024 09:11 #Huge earthquake, #Japan

జపాన్‌ : జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర జపాన్‌లోని ఇవాట్‌, అమోరి ప్రిఫెక్చర్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం కేంద్రం ఇవాట్‌ ప్రిఫెక్చర్‌ ఉత్తర తీర భాగంలో ఉందని జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. దీనికి ముందు సంవత్సరం పశ్చిమ జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలలో 50 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో అనేక భవనాలు, వాహనాలు, పడవలు కూడా దెబ్బతిన్నాయి. భూకంప ప్రమాదాన్ని దఅష్టిలో ఉంచుకుని అధికారులు అక్కడి ప్రజలకు ముందు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. జనవరి 1న ఇషికావా ప్రిఫెక్చర్‌, పరిసర ప్రాంతాలను తాకిన దాదాపు 100 భూకంపాలలో 7.6 తీవ్రతతో కూడిన భూకంపం కూడా ఒకటి. ఆ తర్వాత సునామీ హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు.

➡️