8వరోజు సమ్మె : పోటీ కార్మికులను దించిన అధికార యంత్రాంగం

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ …. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో 8వ రోజుకు చేరింది. ఈరోజు మున్సిపల్‌ కార్మికులతో చర్చించేందుకు ప్రభుత్వాధికారులు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పలుచోట్ల మున్సిపల్‌ కార్మికులకు వ్యతిరేకంగా పోటీ కార్మికులను దింపి ఉద్రిక్తతలకు తావిచ్చారు. ఈరోజు ఉదయం విశాఖలో సచివాలయ సెక్రటరీలతో చెత్తను తీయించేందుకు చెత్తను తరలించే వాహనాలను యార్డు నుండి బయటకు తీసుకొస్తుండగా.. కార్మికులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో విచక్షణారహితంగా కార్మికులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించి అరెస్టులు చేశారు. మరోవైపు … చీమకుర్తిలోనూ పోటీ కార్మికులను దింపి చెత్తను తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. మున్సిపల్‌ కార్మికులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో అక్కడి మున్సిపల్‌ కార్మికులను, నేతలను పోలీసులు అరెస్టులు చేశారు.

పారిశుధ్య కార్మకులు ఒంటి కాలిపై నిరసన కార్యక్రమం - ప్రజాశక్తి మండపేట
పారిశుధ్య కార్మకులు ఒంటి కాలిపై నిరసన కార్యక్రమం – ప్రజాశక్తి మండపేట

 

మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాలో జనసేన పార్టీ పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ మద్దతు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాలో జనసేన పార్టీ పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ మద్దతు తెలిపారు.
నరసరావుపేటలో పోలీసులకు మున్సిపల్ కార్మికులకు మధ్య చిన్నపాటి ఉద్రిక్త వాతావరణం
నరసరావుపేటలో పోలీసులకు మున్సిపల్ కార్మికులకు మధ్య చిన్నపాటి ఉద్రిక్త వాతావరణం
అద్దంకి - మున్సిపల్ పారిశుద్ధ్యకార్మికుల సమ్మె
అద్దంకి – మున్సిపల్ పారిశుద్ధ్యకార్మికుల సమ్మె
➡️