39 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Mar 8,2024 22:11 #Congress, #list

– వాయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసింది. 39 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్‌తో కలిసి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ విడుదల చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మరోమారు వాయనాడ్‌ నుంచి పోటీ చేయనున్నారు. రాజ్‌నంద్‌గావ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భుపేశ్‌ బఘెల్‌, అలప్జుజ నుంచి కెసి వేణుగోపాల్‌, తిరువనంతపురం నుంచి శశిధరూర్‌ పోటీ చేయనున్నారు. ఈ సమావేశంలో వేణుగోపాల్‌ మాట్లాడుతూ తొలి జాబితాలో ఉన్న 39 మందిలో 15 మంది జనరల్‌.. 24 మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనార్టీ అభ్యర్థులని అన్నారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారని చెప్పారు. ఎనిమిది మంది అభ్యర్థులు 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారని తెలిపారు. మిగిలిన 19 మంది 61 ఏళ్లు పైబడినవారని చెప్పారు. తమ లక్ష్యం ఎక్కువ సీట్లను గెలుచుకుని బిజెపి ఫాసిస్ట్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమేనన్నారు.

తెలంగాణ 4 స్థానాలకు ఖరారు

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా ఇందులో 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ కుమార్‌ షేట్కర్‌, నల్గండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా తొలి ఇదే..

ఛత్తీస్‌గఢ్‌

జంజ్‌గిర్‌-చంపా (ఎస్‌సి) -డా.శివకుమార్‌ దహారియా

కోర్బా – జ్యోత్స్న మహంత్‌ రాజ్‌నంద్‌

గావ్‌ – భుపేశ్‌ బాఘెల్‌ దుర్గ్‌ – రాజేంద్ర సాహూ

రాయ్ పూర్‌ – వికాస్‌ ఉపాధ్యాయ్

మహాసముంద్‌ – తమ్రధ్వజ్‌ సాహూ

కర్ణాటక

బిజాపూర్‌ (ఎస్‌సి) – హెచ్‌.ఆర్‌.అల్గుర్‌ (రాజు)

హవేరి – ఆనందస్వామి

శివమొగ్గ – గీతా శివరాజ్‌కుమార్‌

హసన్‌ – శ్రేయస్‌ పటేల్‌

తుమకూరు – ఎస్‌.పి.ముద్ద హనుమెగౌడ

మండ్య – వెంకటరామెగౌడ (స్టార్‌ చంద్రు)

బెంగళూరు (రూరల్‌) – డికె సురేష్‌కేరళ

కాసర్‌గోడ్‌ – రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌

కన్నూరు – కె. సుధాకరన్‌

వడకర – షఫీ పరంబిల్‌

వాయనాడ్‌ – రాహుల్‌ గాంధీ

కోలికోడ్‌ – ఎం.కె. రాఘవన్‌

పాలక్కడ్‌ – వికె శ్రీకందన్‌

అలతూర్‌ (ఎస్‌సి) – రమ్య హరిదాస్‌

త్రిస్సూరు – కె.మురళీధరన్‌

చలకుడి – బెన్నీ బెహనన్‌

ఎర్నాకుళం – హిబి ఇడెన్‌

ఇడుక్కి – డీన్‌ కురియాకోసె

అలప్జుజ – కెసి వేణుగోపాల్‌

మావెలిక్కర (ఎస్‌సి) – కోడికున్నిల్‌ సురేష్‌

పతనంథిట్ట – ఆంటో ఆంటోనీ

అట్టింగల్‌ – అదూర్‌ ప్రకాశ్‌

తిరువనంతపురం – డా. శశిథరూర్‌

లక్షద్వీప్‌

లక్షద్వీప్‌ (ఎస్‌టి) – మహ్మద్‌ హమ్‌దుల్లా సయీద్‌

మేఘాలయా షిల్లాంగ్‌ (ఎస్‌టి) – విన్సెంట్‌

హెచ్‌. పాల తురా (ఎస్‌టి) – సాలెంగ్‌ ఎ.సంగ్మ

నాగాలాండ్‌

నాగాలాండ్‌ – ఎస్‌.సుపోంగమెరెన్‌ జమీర్‌సిక్కిం

సిక్కిం- గోపాల్‌ ఛెత్రి

తెలంగాణ

జహీరాబాద్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌

నల్గండ – రఘువీర్‌ కుందూరు

మహబూబ్‌నగర్‌ – చల్లా వంశీచంద్‌ రెడ్డి

మహబూబాబాద్‌ (ఎస్టీ) – బలరాం నాయక్‌

త్రిపుర

త్రిపుర వెస్ట్‌ – ఆశిష్‌ కుమార్‌ సాహానిని

➡️