న్యూజిలాండ్‌లో 2వ టెస్ట్‌ మ్యాచ్‌.. 172 పరుగులకే బంగ్లా అలౌట్‌

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్‌ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 66 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన ఆ జట్టు 10 వికెట్ల నష్టానికి 172 పరుగులకు అలౌట్‌ అయ్యింది. బంగ్లా టాపార్డర్‌ బ్యాటర్లు హసన్‌ జాయ్ (14), జకీర్‌ హసన్‌ (8), షాంటో (9), మొమినుల్‌ హక్‌ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. ముష్ఫికర్‌ రహీం (35), షాదత్‌ హొసేన్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెహిది హసన్‌ మీరజ్‌ (20), నురుల్‌ హసన్‌ (7), తైజుల్‌ ఇస్లాం (6), షారిఫుల్‌ ఇస్లాం (10) పరుగులు చేసి ఔటయ్యారు. నయీమ్‌ హాసన్‌ (13) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలోమిచెల్‌ సాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. అజాజ్‌ పటేల్‌ 2, కెప్టెన్‌ సౌథీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

➡️