22న ఓటర్ల జాబితా ప్రకటన ఈవీఎంలపై అవగాహన:

22న ఓటర్ల జాబితా ప్రకటన ఈవీఎంలపై అవగాహన:

22న ఓటర్ల జాబితా ప్రకటన ఈవీఎంలపై అవగాహన: డిఆర్‌ఓరాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ రాజశేఖర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 9 వరకు వచ్చిన క్లైమ్‌లకు సంబంధించి 22న పబ్లికేషన్‌ ఉంటుందని, రానున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. బుధవారం డిఆర్‌ఓ ఛాంబర్‌ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని దానికి సంబంధించి 22న పబ్లికేషన్‌ ఉంటుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అది ప్రాముఖ్యమైనదని ఓటు విలువ తెలియజేసి పోలింగ్‌ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారని 25న ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బిజెపి నుంచి అట్లూరి శ్రీనివాసులు, ఆప్‌ పార్టీ నుంచి లోకేష్‌, కాంగ్రెస్‌ నుంచి పరదేశి, సూపరింటెండెంట్‌ బ్యూలా తదితరులు పాల్గొన్నారు.

➡️