2024 – 25 ఆర్ధిక వార్షిక రుణ ప్రణాళిక రూ.13,201 కోట్లు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : మంగళవారం ఉదయం కలెక్టర్‌ ఛాంబర్‌ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్‌ ప్లాన్‌ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ … 2024 – 25 అర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆయా ప్రాధాన్యత, తదితర రంగాల లో అవకాశాల మేరకు అనుబంధ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌హొసిద్ధం చేసి బ్యాంకర్లకు అందచేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్స్‌ 2024-25 ఆర్ధిక సంవత్సరంకి చెందినహొ వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలను విరివిగాహొఅందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌. కె.మాధవీలతహొ కోరారు. ఈ సందర్భముగా జరిగినహొహొ జిల్లా బ్యాంకు సమాఖ్య సమావేశంలో నాబార్డ్‌ జిల్లా అధికారి డాక్టర్‌. వై.యస్‌.నాయుడు వివరిస్తూ, వివిధ బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్య సాధన వివరాలూ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ డి ఎమ్‌ డివి ప్రసాద్‌, నాబార్డ్‌ డి డి ఎమ్‌ – డా వై ఎస్‌ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌. మాధవ రావు, జిల్లా హార్టికల్చర్‌ అధికారి బి. సుజాత కుమారీ , డిసిసిబి , సిజిజి బ్యాంక్‌, ఇతర బ్యాంకు ప్రతినిధులు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️