మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

Jan 31,2024 12:10 #Mexico, #road acident

మెక్సికో: మెక్సికోలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్ ఫ్రంట్ నగరాలైన మజట్లాన్న, లాస్ మోచిస్‌ కోస్టల్ హైవే ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వెనక నుంచి వచ్చి ఓ పెద్ద ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్బులో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 22 మందిని కాపాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️