16వ రోజు సిఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర

Apr 16,2024 11:33

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి

ఏలూరుజిల్లా  16వ రోజైన మంగళవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభైంది. ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా సిఎం సోమవారంనాడు కృష్ణాజిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. రాత్రి గుడివాడలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. బహిరంగ సభ అనంతరం ఏలూరుజిల్లా హనుమాన్‌జంక్షన్‌లో జాతీయరహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకున్నారు. రాత్రి అక్కడ ఏర్పాటుచేసిన శిబిరంలో సిఎం బస చేశారు. రాత్రి కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన నాయకులతో కొద్దిసేపు సిఎం ముచ్చడించారు. మంగళవారం ఉదయం 9 గంటలు దాటిన తర్వాత నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకున్నారు. దారిపొడవునా వైసిపి అభిమానులు, కార్యకర్తలు,నాయకులు నినాదాలతో హోరెత్తించారు. నవ్వుకుంటూ చేతులతో అభివాదం చేస్తూ సిఎం ముందుకు సాగారు. ఉండి శివారులో మధ్యాహ్నం సిఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

➡️