Finland school : కాల్పులకి దిగిన 12ఏళ్ల విద్యార్థి .. ఓ విద్యార్థి మృతి

Apr 2,2024 15:56 #Finland, #fire, #international, #school

హెల్సింకి :    ఫిన్లాండ్‌లోని పాఠశాలలో ఓ మైనర్‌ కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో  ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు  పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన మైనర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

వివరాల ప్ర కారం.. హెల్సింకిలోని నాలుగవ అతిపెద్ద నగరమైన  వాన్టాలోని  పాఠశాలలో మంగళవారం ఉదయం 10.00 గంటల (స్థానిక కాలమానం ప్రకారం 7.00) సమయంలో 12 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించాడు.  ఆ సమయంలో పాఠశాలలో 90 మంది పాఠశాల సిబ్బంది సహా 800 మంది చిన్నారులు ఉన్నారు.  ఒకటి నుండి తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరయ్యారని, వీరంతా ఏడు నుండి 15 సంవత్సరాల వయస్సులోపు వారని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకుని,   కాల్పులకు పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.  ఆరవ గ్రేడ్ విద్యార్థి మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు.

ఈ ఘటన షాకింగ్‌కు గురిచేసిందని ఫిన్లాండ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మారి తెలిపారు. ఈ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

➡️