శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం స్వామివారిని 73,051 మంది యాత్రికులు దర్శించుకోగా 34,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 2. 92 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

➡️