10న అనంతకు సుప్రీంకోర్టు జడ్జిల రాక

జడ్జిల పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ గౌతమి

            అనంతపురం కలెక్టరేట్‌ : ఈనెల 10వ తేదీన జిల్లాకు సుప్రీంకోర్టు జడ్జిలు రానున్నారు. ఈ నేపథ్యంలో జడ్జిట పర్యటనకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ ఎం.గౌతమి బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తేదీన అనంతపురం జెఎన్‌టియు ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఫర్‌ యంగ్‌ అడ్వకేట్స్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా జడ్జి జస్టిస్‌ అశానుద్దీన్‌ అమానుల్లా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. గౌరవ అతిథులుగా న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా జడ్జి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యూఢిల్లీ సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా జడ్జి గౌరవ జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు ఛైర్మన్‌, సీనియర్‌ అడ్వకేట్‌ మనన్‌కుమార్‌ మిశ్రా పాల్గొంటారన్నారు. వీరితో పాటు ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జీలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరవుతారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాన్వారు ఏర్పాటుపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. కాన్వారులో అంబులెన్స్‌, స్పెషలిస్ట్‌ డాక్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. జెఎన్‌టియులో కార్యక్రమం పూర్తయ్యే వరకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, మున్సిపల్‌ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకష్ణారెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఏ.రామిరెడ్డి, అడ్వకేట్లు హరినాథ్‌ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

➡️