10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 20,2024 15:54 #collector, #palanadu
  • పరీక్షల నిర్వహణపై అధికారులతో ఇంచార్జ్ రెవిన్యూ అధికారి సమీక్ష..

ప్రజాశక్తి-పల్నాడు : వచ్చే నెల 18 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జ్ రెవిన్యూ అధికారి అజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా రెవిన్యూ అధికారి ఛాంబర్ లో సంబందిత అధికాలతో పరీక్షలు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని, త్రాగునీటి వసతి, ప్రధమ చికిత్స కేంద్రాలను ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు 127 సెంటర్లలో నిర్వహించనున్నట్లు, మొత్తం 29244 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని తెలిపారు. ప్రశ్నాపత్రాలను ఆన్సర్ షీట్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములను పటిష్టంగా ఉంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణ అప్పుడు జిరాక్స్ సెంటర్లు ఉండకుండా చూడాలని అదేవిధంగా 144 సెక్షన్ అమలుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయం మరియు సహకారంతో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు కలుగకుండా టీం వర్క్ తో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సంబంధించి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️