1.11 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు : పౌర సరఫరాలశాఖ కమిషనరు అరుణ్‌కుమార్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దైవార్షిక పథకంలో భాగంగా అర్హులై ఉండి పలు కారణాలతో రేషన్‌కార్డులు పొందలేకపోయిన వారికి ప్రభుత్వం 1,11,321 కార్డులను మంజూరు చేసిందని పౌర సరఫరాలశాఖ కమిషనరు హెచ్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. కొత్త కార్డుల వల్ల 2,59,687 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. నూతనంగా కార్డులు మంజూరైన లబ్ధిదారులందరూ కొత్త రేషన్‌కార్డు, కార్డు విభజన కోసం 2023 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు దరకాస్తు చేసుకున్న వారేనన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 1.48 కోట్ల కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుందన్నారు. కొత్తగా మంజూరు చేసిన రేషన్‌కార్డు దారులందరికీ జనవరి నెల నుంచే బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ ఉంటుందన్నారు.

జిల్లాలవారీ కొత్తగా మంజూరైన కార్డులు

అల్లూరి సీతారామరాజు 2,333 కార్డులు, అనకాపల్లి 3,375, అనంతపురం 5,708, అన్నమయ్య 4,075, బాపట్ల 3,038, చిత్తూరు 3,991, తూర్పుగోదావరి 4,891, ఏలూరు 4,538, గుంటూరు 3,958, కడప 4,897, కాకినాడ 4,434, అంబేద్కర్‌ కోనసీమ 4,348, కృష్ణా 3,540, కర్నూలు 6,657, మన్యం 2,050, నంద్యాల 4,540, నెల్లూరు 5,266, ఎన్‌టిఆర్‌ 4,289, పల్నాడు 4,129, ప్రకాశం 5,162, శ్రీకాకుళం 4,945, శ్రీసత్యసాయి 4,869, తిరుపతి 4,078, విశాఖపట్నం 3,055, విజయనగరం 4,254, పశ్చిమగోదావరి 4,901 రేషన్‌ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది.

➡️