పులివెందులలో టిడిపి జెండాను ఎగురవేస్తాం

ప్రజాశక్తి- కడప ప్రతినిధి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ అంతులేని నిర్లక్ష్యం వహించడం దారుణ మని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు విమర్శిం చారు. శుక్రవారం ఆయన జిల్లాలోని కమలాపురం నియోజ కవర్గ కేంద్రంలో టిడిపి ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించిన రా..కదలిరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కడప స్టీల్‌ప్లాంట్‌, సాగు నీటి ప్రాజెక్టు, డ్రిప్‌ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల్లో ఎటువంటి పురోగతీ లేకుండా పోయిం దన్నారు. మాటలు కోటలు దాటాయని, చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. తాను అధికారంలో ఉంటే ఖరీఫ్‌, రబీ సీజన్‌లో నష్టపోయిన నేపథ్యంలో కరువు మండ లాలుగా ప్రకటించే వాడినని తెలిపారు. సాగర్‌ నీటిని నల్లమ లలో టన్నెల్‌ తవ్వి బనకచర్లలో పోసి రాయలసీమ తలరాతనే మార్చేస్తానని తెలిపారు. జిల్లాలో పది ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను ఇచ్చినప్పటికీ ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పూ రాలేదని తెలిపారు. మళ్లీ అన్ని సీట్లు ఇచ్చి గెలిపిస్తారా తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. ఈదఫా పులివెందుల్లో టిడిపి జెండాను ఎగుర వేయడం తథ్యమన్నారు. వైఎస్‌ వివేకా హంతకులకు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. నాసిరకం వైన్స్‌ ద్వారా ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, కరెంటు, ఆర్టీసీ, చెత్త ఛార్జీలను అమాంతంగా పెంచేశారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సుపరిపాలన హామీ ఏమైందన్నారు. గండికోట తెలుగుగంగ, నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్నారు. 2014 -2019 టిడిపి హయాంలో 12,050 కోట్లు ఖర్చు చేశామని, వైసిపి హయాంలో ఏమేరకు ఖర్చు చేశారో చెప్పాలని నిలదీశారు. త్వరలో రైతు రాజ్యం రాబోతుందని, రైతులే రాజ్యం చేస్తారని పేర్కొన్నారు. రూ.95 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దువ్వూరు వాసి అక్బర్‌బాషా భూమిని ముఖ్యమంత్రి బంధువు తిరుపాల్‌రెడ్డి కబ్జా చేయడం పరాకాష్ట్రకు చేరుకుందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 22 ఎ చట్టాన్ని రద్దు చేస్తామని తెలిపారు. కబ్జాదారులను వదలబో నని హెచ్చరించారు. రైతుల పాసుపుస్తకాలపై బొమ్మలు వేయిం చుకోవడంతో పిచ్చి పరాకాష్ట్రకు చేరుకుందని తెలిపారు. చివరికి వైవియూలోని వేమన విగ్రహాన్ని తొలగించి తన విగ్రహం పెట్టించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏమి చేస్తాడని పేర్కొ న్నారు. అన్న క్యాంటీ న్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. కర్నూలులో హై కోర్టు, విశాఖ, కడప, అనం తపురం జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జిల్లాలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బెట్టింగ్‌ ప్రసాద్‌గా మారిపోయాడన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కబ్జాదారిగా మారాడని విమర్శి ంచారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి యాక్టర్‌గా మారిపోయాడని తెలిపారు. బద్వేల్‌ నాయకులు కబ్జాలకు కేరాప్‌ అడ్రెస్‌గా మారారని విమర్శించారు. డిప్యూటీ సిఎంగా ఉన్న అంజాద్‌బాషా ఉత్సవ విగ్రహంగా మారాడన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి కరెప్షన్‌ కింగ్‌గా మారాడని విమర్శించారు. ఈయన లేపాక్షి భూముల దగ్గర నుంచి బుగ్గవంక వరకు కబ్జా యత్నం చేశారన్నారు. పోతిరె డ్డిపాడు, నిప్పులవాగు, కెసి కెనాల్‌ సామర్థ్యా లను పెంచు తామన్నారు. టిడిపి, జనసేన కార్యకర్తలు సమష్టిగా 82 రోజులు గ్రామాల్లో తిరిగి పని చేస్తే మిమ్మల్ని ఆధుకునే బాధ్యత తీసు కుంటానని భరోసా నిచ్చారు. కార్య క్రమంలో అనంత పురం జిల్లాకు చెందిన మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరద రాజులరెడ్డి, విజయమ్మ, మాజీ ఎమ్మెల్సీలు బి.టెక్‌రవి, బత్యాల చెంగల్రాయులు, బచ్చల పుల్లయ్య, రాయచోటి, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇన్‌ఛార్జులు ఆర్‌.రమేష్‌రెడ్డి, మాధవీరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, భూపేస్‌రెడ్డి, బద్వేలు యువ నాయకులు రితేష్‌రెడ్డి, వేలాది మంది టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️