వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

Dec 14,2023 12:58 #road accident

వెనెజులా : వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

➡️