ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన పొత్తు : నేడు అధికారిక ప్రకటన

Feb 24,2024 12:00 #aap-congress, #Delhi

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుందని కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేశ్‌ ధృవీకరించారు. శనివారం ఇరు పార్టీలకు చెందిన నేతలు సంయుక్త మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తును ప్రకటించనున్నారని జైరాం రమేష్‌ తెలిపారు.

కాగా, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్‌, గోవా, గుజరాత్‌ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలో నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. గుజరాత్‌లో రెండు లోక్‌సభ స్థానాల్లో, హర్యానాలో ఒక స్థానంలో ఆప్‌ పోటీ చేయనుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తు ఉండదని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం 13 స్థానాల్లో ఆప్‌ బరిలో దిగుతుందని ఆయన వెల్లడించారు. ఇక మిగిలిన రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై నేడు అధికారక ప్రకటన వెలువడనుంది.

➡️