ప్రకాశం జిల్లా చీరాలలో టిడిపి, వామపక్షాలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరులు, అనుచరగణం దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముందస్తు అనుమతి తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన బహిరంగసభపై ఎమ్మెల్యే అనుయాయులు దాడి చేస్తుంటే పోలీసులు గుడ్లప్పగించి చూశారని విమర్శించారు. సభలో ఉన్న వారిపై కారంచల్లి, కుర్చీలను విసిరేస్తుంటే పోలీసులు నిస్సహాయస్థితిలో ఉండిపోయారని తెలిపారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరులు స్వాములు, ఇతర అనుచరగణాన్నీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి, జైలుకు పంపితేనే హోం శాఖపై, సిఎంపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని పేర్కొన్నారు.
డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం
5 నుండి విజయవాడలో 'జజ్జనకరి జనారే'
ర్యాగింగ్ చేస్తే పదేళ్ల జైలు
భోలక్‌పూర్ కలుషిత నీటి సరఫరా ఘటనలో... ఐదుగురు వాటర్ వర్క్స్ అధికారుల అరెస్ట్
ఆగస్టు 8 నుంచి ప్రజల్లోకి చిరంజీవి
మారని బిహెచ్‌పివి తలరాత
పురపాలక శాఖలో 4,027 పోస్టులు భర్తీ
దొడ్డిదారిన సిఎం అయ్యావ్ ...
బోధనాసుపత్రుల్లో టీచింగ్ బంద్