వరంగల్ జిల్లా ఎన్‌జివోస్ కాలనీ ప్రజాశక్తి విలేకరి ఎం. సునీల్‌కుమార్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పూర్తయ్యాయి. అంతిమయాత్రకు విద్యార్థులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మృతదేహంతో ఎంజిఎం నుండి ములుగురోడ్డు, హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రెస్‌క్లబ్, అమరవీరుల స్థూపం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి మృతుని ఇంటి వరకు యాత్ర సాగింది. ప్రెస్‌క్లబ్ వద్ద సునీల్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి జర్నలిస్టులు నివాళి అర్పించారు. పలువురు లాయర్లు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణా కోసం పోరాడాలన్నారు. అంతిమయాత్రలో ప్రజాశక్తి సిబ్బంది నాగేశ్వరావు, రామాచారి తదితరులు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో ఆహ్వానిత సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.
డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం
5 నుండి విజయవాడలో 'జజ్జనకరి జనారే'
ర్యాగింగ్ చేస్తే పదేళ్ల జైలు
భోలక్‌పూర్ కలుషిత నీటి సరఫరా ఘటనలో... ఐదుగురు వాటర్ వర్క్స్ అధికారుల అరెస్ట్
ఆగస్టు 8 నుంచి ప్రజల్లోకి చిరంజీవి
మారని బిహెచ్‌పివి తలరాత
పురపాలక శాఖలో 4,027 పోస్టులు భర్తీ
దొడ్డిదారిన సిఎం అయ్యావ్ ...
బోధనాసుపత్రుల్లో టీచింగ్ బంద్