రాష్ట్రంలో బిటి పత్తివిత్తనాల ధరలు పెరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె రోశయ్య అన్నారు. బిటి విత్తనాల ధరలు పెంచడానికి ఉత్పత్తి సంస్థలకు తాము అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబులకు ముఖ్యమంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ వారు ఈ విషయం తెలిపారు. బిటి పత్తి విత్తనాల తయారీకి అధిక ఖర్చు అవుతుండటంతో వాటి ధర పెంచుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని ఆ విత్తనాల ఉత్పత్తి సంస్థలు కొద్దికాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ మేరకు బిటి పత్తి విత్తన ఉత్పత్తిదారుల తరపున పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కోసం ధరలు పెంచకతప్పదని ఈ ప్రకటనల్లో వారు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వొద్దని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనికి భిన్నంగా ధరలు పెంచడానికి అంగీకరిస్తే రైతాంగ ఆందోళన తప్పదని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. మంగళవారం ముఖ్యమంత్రిని మంత్రులు కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. విత్తనాల ధరల పెంపుదలకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం నిజమేనని, అదే సమయంలో కోమటిరెడ్డి రాసిన లేఖను తాను చూశానని సిఎం వారికి చెప్పారు. ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.
బాబు కన్నీళ్లు పెట్టినట్టుంది ...!
వరదనష్టాలపై జరిగిన చర్చలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టినట్టుందని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. శాసనసభ బుధవారానికి వాయిదా పడిన తరువాత సచివాలయానికి వెళుతూ ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. 'చంద్రబాబు కన్నీళ్లు పెట్టినట్టుందంటూ విలేకరులన్న మాటకు స్పందిస్తూ ముఖ్యమంత్రి 'అవును ... నాకూ అలాగే కనిపించింది' అని ముఖ్యమంత్రి అన్నారు. 'ఆయన ఆ ప్రాంతాల్లో తిరిగివచ్చాడు కదా... ఆ సంఘటనలన్ని గుర్తుకొచ్చి ఉంటాయి' అని చెప్పారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ 'చంద్రబాబు హృదయవేదన అది' అని అన్నారు.
డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం
5 నుండి విజయవాడలో 'జజ్జనకరి జనారే'
ర్యాగింగ్ చేస్తే పదేళ్ల జైలు
భోలక్‌పూర్ కలుషిత నీటి సరఫరా ఘటనలో... ఐదుగురు వాటర్ వర్క్స్ అధికారుల అరెస్ట్
ఆగస్టు 8 నుంచి ప్రజల్లోకి చిరంజీవి
మారని బిహెచ్‌పివి తలరాత
పురపాలక శాఖలో 4,027 పోస్టులు భర్తీ
దొడ్డిదారిన సిఎం అయ్యావ్ ...
బోధనాసుపత్రుల్లో టీచింగ్ బంద్