పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాటలో భాగంగా మొదటి రోజు శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం 400 టిఎంసిల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు లక్షల 70 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, ఏటా జూన్‌లోనే సాగునీటిని విడుదల చేయవచ్చని అన్నారు. నీటి విడుదల ఆలస్యం కావడంతో ఏటా రూ.రెండు వేల కోట్ల వరకూ రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ ప్రాజెక్టు విషయమై ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ముఖ్యమంత్రులతో చర్చించామన్నారు. అనంతరం సిఎం మామిడిగొందిలోని కుడికాలువ కొండ సొరంగ మార్గాన్ని పరిశీలించారు. దేవరగొంది నిర్వాసితులతో మాట్లాడారు. నష్టపరిహారం సక్రమంగా అందేలా చూస్తామని, ఆర్‌ఆర్ ప్యాకేజీని గతం కంటే మెరుగ్గా అందజేస్తామని హామీ ఇచ్చారు. తమకు భూమికి భూమి ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాసితులు సిఎంను కోరారు. ముద్దప్పగూడెంలో రోడ్లు బాగు చేయాలని, తాగునీరు, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు గోడౌన్ నిర్మించాలని కోరారు. దీనిపై స్పందించిన సిఎం రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, రూ.20 లక్షలు, మార్కెటింగ్ గోడౌన్‌కు రూ.20 లక్షలు కేటాయిస్తామని, గిరిజనుల భూములకు ఇందిర జలప్రభ ద్వారా నీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బుట్టాయగూడెం మండలం కెఆర్‌పురం ఐటిడిఎలో రూ.2.50 కోట్లతో నిర్మించనున్న యూత్ ట్రైనింగ్ సెంటర్, రూ.2.90 కోట్లతో నిర్మించనున్న కామవరం-రామచంద్రపురం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లకీëనారాయణ, మంత్రులు వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ కావూరి సాంబశివరావు, కలెక్టర్ వాణీమోహన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
ప్రచారానికే పెద్ద పీట
ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట తొలిరోజు ప్రజా సమస్యల గురించి కాక ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకోవడమే ప్రధానంగా సాగింది. నాలుగో విడత ఇందిరమ్మ బాట కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోలవరం ప్రాజక్టును పరిశీలించడంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడారు. అక్కడ జనం సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధపడుతుండగా, ఎంపిక చేసిన కొంతమందితో మాత్రమే మాట్లాడించారు. నిర్వాసితులు ఇద్దరు మాట్లాడగానే ఎంపి, ఎమ్మెల్యేల తరువాత ముఖ్యమంత్రి ప్రసంగించారు. అనంతరం ప్రజలు తమ సమస్యలు, పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు తెలుపుతూ వినతిపత్రాలు ఇచ్చారు. సిఎంకు వినతిపత్రాలు ఇస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ప్రజలను సిఎం దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన సిఎం తన టూరు మొత్తంలో ఎక్కడా ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు శారు. మహిళా సంఘాల సమావేశంలో కూడా సిఎం కొందరితోనే మాట్లాడించారు. 2014 ఎన్నికలకు సంబంధించి టికెట్ల ఆశావహులు తమ నేతలకు స్వాగతం తెలుపుతూ బ్యానర్లు కట్టి హడావిడి చేశారు. ఈ కార్యక్రమాల్లో సింఎ వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లకీëనారాయణ, జిల్లా మంత్రులు వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపి కావూరి సాంబశివ రావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఉన్నతాధికారులు ఉన్నారు.