ఈశాన్న రాష్ట్రాల్లో నెలకొన్న అవాంఛనీయ సంఘటనల ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన అస్సామీయుల్లో ఆందోళన మొదలైందని, ఆ భయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు.
ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న అస్సామీయులను అభద్రతా భావం వెంటాడుతోందని, వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి సంఘటనలు దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీస్తాయన్నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారని, వారికి రక్షణ కల్పించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫల మయ్యాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకునే విధంగా ఆదేశించాలని ప్రధానిని కోరారు.
java.lang.NullPointerException