మరోసారి...

లోక్‌పాల్‌ బిల్లులో ప్రధాని పేరు చేర్చినా అందులో దోషులు తప్పించుకోవడానికి సవాలక్ష మార్గాలను కనిపెట్టి మరీ పేరును చేర్చింది ప్రభుత్వం. కేవలం పేరున్నంతమాత్రాన సరిపోదు కదా! అలాగే దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తారట! ప్రధానిని గానీ ఇంకెవరిపైనైనా చర్యలు తీసుకోవాలంటే ఆ కమిటీ చెబితేనే చేయాలి తప్ప స్వతంత్ర నిర్ణయాధికారం లేదు ఈ బిల్లులో సిబిఐని కూడా చేర్చలేదు. అధికార పక్షానికి ఒకపక్క అన్నాహజారే ఉద్యమం, మరోపక్క ప్రతిపక్షాల ఒత్తిడితో తప్పనిసరై లోక్‌పాల్‌ని పార్లమెంటులో పెట్టాల్సి వచ్చింది. మూజువాణి ఓటుతో లోక్‌సభ మాత్రవే ఆమోదించింది. ఇన్ని అవకతవకలున్న లోక్‌పాల్‌ బిల్లు అవసరమా? అందుకే మరలా ప్రతిపక్షాలు, విపక్షాలు చెప్పిన అంశాలను లోక్‌పాల్‌ పరిధిలోకి చేర్చి పటిష్ట లోక్‌పాల్‌ను తేవాలి.

ఎస్‌. రామచంద్రరాజు, ప్రకాశంజిల్లా.

Sorry

java.lang.NullPointerException