రెండు నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో దిగుబడి రాదేమోనన్న మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే విద్యుత్ కోతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పగటిపూట, విద్యుత్ సరఫరాని నిలుపుదల చేసి, రాత్రి వేళల్లో ఇవ్వడంతో పొలాలకు వెళ్లి పలు ప్రమాదాలకు గురవుతున్నారు. 2010లో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడికి చేసిన అప్పు తీర్చే మార్గం లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది. వ్యవసాయ రంగానికి కావలసిన పెట్టుబడులకు కొరత లేకుండా చూడాల్సింది ప్రభుత్వమే. ప్రస్తుతం ఈ రంగంలో వస్తున్న తీవ్ర మార్పులపై గత ప్రభుత్వాల విధానాల ప్రభావం కూడా ఉంది.
అనుపోజు సంతోషి నాగరాజు, విజయనగరం.