భూమిని అప్పగించి జీవనోపాధి కల్పించాలి

వరదగట్లుకు కేటాయించి మిగులు భూమిని తమకు అప్పగించాలని గులుమూరు గ్రామానికి చెందిన రైతులు సిపిఎం నాయకులు జిల్లా కోరాడనారాయణరావు ఆధ్వర్యంలో తహశీల్దారు బలివాడ ఆదినారారాయణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ 1984లో వరశధార నదికి వరద గట్లు నిర్మాణం కొంత స్థలాన్ని భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లించారన్నారు. ఆ భూమిలో కొంత మేర వరదగట్లు నిర్మంచగా సుమారు 23 ఎకరాలు భూ భాగం మిగిలిపోయిందని, అప్పట్లో గ్రామస్తులు దానికి పశువుల కోసం విడిచి పెట్టాలని కోరానని తెలిపారు. కొద్ది రోజుల కిందట దళితులు ఆ భూములను సాగుచేసేవారన్నారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఆ భూములు విడిచిపెట్టామన్నారు. వరదల అనంతరం డబ్బు పొందిన భూ యజమానులే ఆ భూములను సాగు చేసుకుంటున్నారన్నారు. ఆ భూములు తక్షణమే అప్పగించాలని కోరారు. లేకుంటే ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా ఆ భూములను ఇచ్చి జీవనోపాధి కల్పించాలన్నారు. ఈ విషయమై తహశీల్దారు స్పందిస్తూ వీటిపై సమగ్ర సమాచారాన్ని వంశధార అధికారులు, జిల్లా కలెక్టరుకు అందజేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్