ఆటో బోల్తా- ఆరుగురికి గాయాలు

గార మండలం శ్రీకూర్మం జంక్షన్‌ వద్ద శనివారం ఆటోబోల్తాపడిన సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా తయారైంది. ప్రమాదంలో శ్రీకాకుళం లెప్రరిసీ కాలనీ గొల్లవీధికి చెందిన 12 మంది ఆటోపై శ్రీకూర్మం యాత్రకు బయలుదేరారు. శ్రీకూర్మం జంక్షన్‌ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించడానికి ఆటో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో పి అప్పడు తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పడు పరిస్థితి విషమించడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. రిమ్స్‌ అవుట్‌ పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

Sorry

java.lang.NullPointerException