'కనీస కూలి అమలు చేయాలి'

ప్రభుత్వం ప్రకటించిన కనీస కూలి రేట్లు జిల్లాలో అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోరాడ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన జిల్లా కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిఓ నెం.93లో స్త్రీ, పురుషులకు సమాన వేతనం అమలు చేయాలని ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. జిఓ విడుదల నాటి కంటే నేడు మూడు రెట్లు నిత్యావసర ధరలు పెరిగాయని, అందుకనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు. చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం నిద్రావస్థలో ఉండడంతో ఫ్యూడల్‌ కాలం నాటి పద్ధతులు నేటికీ అమలవుతున్నాయని చెప్పారు. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటలు పనిచేస్తే స్త్రీలకు ఇచ్చే కూలి గరిష్టంగా రూ.80 మాత్రమే అని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళా కార్మికులకు అతి తక్కువ వేతనాన్ని ఇస్తున్నారని, మెట్ట ప్రాంతాల్లో మరీ దారుణంగా ఉందన్నారు. ఉపాధి హామీ పథకంలోనూ వివక్షత వెంటాడుతోందన్నారు. హిరమండల కేంద్రంలో బొట్టికవీధి రోడ్డు పనుల్లో పురుషుల కంటే స్త్రీలకు తక్కువ కూలి ఇచ్చి, వారి పేరు మీద డబ్బులను డ్రా చేసుకున్నారని చెప్పారు. కనీస కూలి రేట్లు జిల్లాలో అమలు చేయించి, స్త్రీలకు సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్