ఇది వాటికి భిన్నం

  • మొహాలీలో స్పోర్టింగ్‌ పిచ్‌

ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య ఏకపక్షంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌ మొహాలీలో హోరాహోరి సాగే అవకాశం ఉంది. చెన్నరు, హైదరాబాద్‌ కంటే ఈ పిచ్‌ భిన్నంగా ఉండడమే దీనికి కారణం. మొహాలీ పిచ్‌ను స్పోర్టింగ్‌ వికెట్‌గా తయారు చేశారు. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు ఇక్కడ ఆసీస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. స్పిన్‌ పిచ్‌ల కోసం పట్టుబడుతున్న కెప్టెన్‌ ధోనీకి ఇది మింగుడు పడని వార్తే.

'పిసిఎ గ్రౌండ్‌ వికెట్‌ అదే విధంగా (చెన్నరు, హైదరాబాద్‌) ఉండదు. ఇరు జట్లకు అనుకూల పరిస్థితి ఉంటుంది. తొలి రెండు టెస్టుల్లోలాగా ఇక్కడ ఏకపక్షంగా ఫలితం ఉండదు. ఇక్కడ నిజమైన క్రికెట్‌ను చూడొచ్చు.'అని పిసిఎ సెక్రటరీ ఎమ్‌పి పాండోవ్‌ తెలిపారు. గ్రౌండ్‌మెన్‌ కాంపిటీటివ్‌ పిచ్‌ తయారు చేశాడని, ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని పిసిఎ అధ్యక్షుడు ఐఎస్‌ బింద్రా పేర్కొన్నారు. యువతకు, విద్యార్ధులకు రూ.150కే ఐదు రోజుల టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నేటి నుంచి టిక్కెట్ల అమ్మకాలు మొదలౌతాయన్నారు. చెన్నరులో ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో, హైదరాబాద్‌లో ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో ధోనీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Sorry

java.lang.NullPointerException