భారత క్రికెటర్ రాహుల్ శర్మ, దక్షిణాఫ్రికా క్రికెటర్ వ్యానె ప్యార్నెల్‌పై డ్రగ్స్ ఛార్జిషీట్ నమోదైంది. ఐపిఎల్-5 సందర్భంగా గత ఏడాది మేలో ముంబయిలో రేవ్‌పార్టీలో పుణె వారియర్స్ ఆటగాళ్లైన వీరు పట్టుబడ్డారు. ఆ పార్టీలో పోలీసులకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికింది. అక్కడ మొత్తం 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు చేశారు. '35 మంది నేరారోపితులతో సహా 86 మందిపై మేము 1,200 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశాం. అందులో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. వారికోసం గాలిస్తున్నాం.' అని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ప్యార్నెల్ కూడా వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. పుట్టినరోజు పార్టీ ఆహ్వానం మేరకు అక్కడి వెళ్లినట్లు క్రికెటర్లు చెబుతున్నారు.