ఇంటర్-స్టేట్ టి20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు జాతీయ సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. 15 మంది జట్టు సభ్యులు గల జట్టును చేతన్ చౌహన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. జట్టుకు రజత్ బాటియా సారథ్యం వహించనున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ కూడా జట్టులో ఉన్నాడు. ఢిల్లీకి కోచ్‌గా విజరు దాహియా వ్యవహరించనున్నాడు.