శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర ఖాతాలో మరో టెస్టు సెంచరీ చేరింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా కెరీర్‌లో 30వ సెంచరీ చేశాడు. పాకిస్తాన్‌పైన 9వ సెంచరీ సాధించాడు. దీంతోపాటు పాకిస్తాన్‌పై ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 2,089 పరుగుల రికార్డును కూడా అధిగమించాడు. ఈ సెంచరీతో పాకిస్తాన్‌పై అత్యధిక సెంచరీలు చేసిన అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో జయవర్ధనే (31) తర్వాతి స్థానంలో సంగక్కర నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలతో సచిన్ (51) టాప్‌స్థానంలో కొనసాగుతున్నాడు.