పుణె ఆఫీస్‌లో ఐటి సోదాలు !

ముంబయి, పుణెలోని ఐపిఎల్‌ జట్టు సహారా పుణె వారియర్స్‌ ఆఫీస్‌ల్లో ఐటి బృందం సోదాలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పరిశీలన కోసం కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఐపిఎల్‌ టోర్నీలో నల్లధనం చలామణీ అవుతోందని ఇండియా టివి స్టింగ్‌ ఆపరేషన్‌లో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఐపిఎల్‌ ఫ్రాంఛైజీల లావాదేవీలపై ఐటి దృష్టికేంద్రీకరించింది. తమ ఆఫీసుల్లో ఐటి సోదాల జరిపిందన్న వార్తలను సహారా గ్రూప్‌ కొట్టిపడేసింది. పుణె వారియర్స్‌కు ముంబయి, పుణెలలో ఆఫీసులు లేవని తెలిపింది. ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడానికి ఐపిఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా నిరాకరించాడు. అది ఐటికి సహారాకు సంబంధించి విషయమన్నాడు.

Sorry

java.lang.NullPointerException