కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ముక్కోణపు టోర్నీ చివరి అంకానికి చేరింది. టైటిల్ వేటలో ఆసీస్..గెలిచి బరిలో నిలవాలని లంకేయులు నేడు బరిలోకి దిగనున్నారు. తొలి ఫైనల్ మ్యాచ్ నెగ్గి సిబి సిరీస్ టైటిల్‌కు క్లార్క్ సేన అడుగుదూరంలో నిలిచింది. రెండో ఫైనల్లో లంకేయులను ఓడించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీ నెగ్గాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. కానీ ఈ మ్యాచ్‌ను కూడా లంక ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. తొలిఫైనల్లో ఆసీస్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 15 పరుగుల తేడాతో లంకకు విజయం చేజారింది. బెస్టాప్ త్రిని 1-1 సమం చేసి మార్చి 8న జరగనున్న చివరి మ్యాచ్‌లో టైటిల్ బరిలో నిలవాలని లంకేయులు భావిస్తున్నారు.
బ్యాటింగ్ అదుర్స్ : రెండు జట్లలో బ్యాట్స్‌మెన్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగమే రెండు జట్లను కలవరానికి గురిచేస్తోంది. లంక జట్టులో కెప్టెన్ జయవర్ధనే, దిల్షాన్, సంగక్కర ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తొలి ఓవర్లలోనే బ్యాట్‌ఝలి పిస్తున్నారు. దినేష్ చాందిమల్ మిడిలార్డర్‌లో జట్టుకు ప్రధాన బలం. టెయిలెండర్లు కులశేఖర, పెరీరా, తరంగ బ్యాటింగ్‌లో మెరుస్తున్నారు.
ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మాథ్యూ వేడ్ శుభారంభాలు ఇస్తున్నారు. మిడిలార్డర్‌లో కెప్టెన్ క్లార్క్, క్రిస్టియన్, డేవిడ్ హస్సీ, మైక్ హస్సీ రాణిస్తున్నారు.
ట్రై సిరీస్ చివర్లో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించు కోవడంతో 300 పరుగుల స్కోర్లు నమోదవుతున్నాయి. 'పవర్‌ప్లే, డెత్ ఓవర్లు (బౌలింగ్) సిరీస్ మొత్తం మాకు సమస్యగా మారాయి. వారు (బౌలర్ల) నెట్‌లో వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నారు. కానీ ఒత్తిడికి గురవుతున్నారు. ఇది క్షమార్హం కాదు. మేము ఉత్తమంగా ఉన్నాం కాబట్టే ప్రపంచ నెం.1గా ఉన్నాం' అని క్లార్క్ తొలి ఫైనల్ మ్యాచ్ అనంతరం క్లార్క్ అన్నాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ హిల్ఫెనాస్, జేమ్స్ ప్యాటిన్సన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. టెస్టు సిరీస్‌లో కూడా వీరు మెరుగైన ప్రదర్శన చేశారు. వెటరన్ బౌలర్ బ్రెట్‌లీ వీరికి అండగా నిలుస్తున్నాడు. క్షేవియర్ డోహర్టి వన్డే సిరీస్‌లో 4.18 సగటుతో 9 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.
శ్రీలంక : జయవర్ధనే (కెప్టెన్), దిల్షాన్, సంగక్కర, దినేష్ చాందిమల్, లాహిరు తిరిమానే, నువాన్ కులశేఖర, మలింగ, హెరాత్, దమనిక ప్రసాద్, మహరూప్, ఉపుల్ తరంగ.
ఆసీస్ : మైకెల్ క్లార్క్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, షేన్ వాట్సన్, పీటర్ ఫారెస్ట్, మైకెల్ హస్సీ, డేవిడ్ హస్సీ, డాన్ క్రిస్టియన్, క్షేవియర్ డోహర్టి, బ్రెట్‌లీ, బెన్ హిల్ఫెనాస్, జేమ్స్ ప్యాటిన్సన్.