సమయం సందర్భం.. సభామర్యాద

ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, ఓ సభ అవసరం. సాహిత్యానికో, సంగీతానికో, వేడుకలకో, ప్రారంభోత్సవమో, ముగింపో, కొందరు పెద్దలు వేదికపై ఆశీనులవడం వారికెదురుగా ప్రేక్షకులుండటం.... ఆ కార్యక్రమం ఏదైనా.. సంబంధిత రంగంలో ఆసక్తి ఉన్నవారు, నిర్వాహకుల పట్ల గౌరవాభిమానాలతో మరికొందరు, మొహమాటానికి కొందరు, సిద్ధాంతాలకు బద్ధులైన వారు ... ఇలా మొత్తానికి ఓ సమూహం ఏదో ఒక ప్రాంగణంలో చేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తారు. ఇది మనకు ఎదురయ్యే సభల సహజ స్వరూపం. ఒకసారి సభ నిర్వహణ లోటుపాట్లు పరిశీలిస్తే కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధానంగా కనిపించే లోపాలు ....

1. ప్రారంభానికయ్యే ఆలస్యం :

సభా ప్రారంభానికి నిర్ణీత సమయం కేటాయించడం ఆనవాయితీ. సాధారణంగా ఆ సమయానికి కొందరు, నిర్వాహకులు, కార్యకర్తలు మాత్రం కనిపిస్తారు. సభకు రావాల్సిన పెద్దలు వ్యక్తిగత కారణాలో లేక ట్రాఫిక్‌ సమస్యలో.. చెబుతూ ఆలస్యంగా రావడం ఆనవాయితీ! మొత్తానికి కొంత సమయాభావంతో రావడం జరుగుతూ ఉంటుంది. వరుస ఫోన్లు చేస్తూ నిర్వాహకులు ఎదురు చూడటం... ఏ వాహనం వచ్చినా... అది రావాల్సిన పెద్దలదేనని ప్రేక్షకులు భావించటం సహజం. ఈ స్థితికి భిన్నంగా ఎవరు వచ్చినా, రాకపోయినా సమయానికి సభను ప్రారంభించడం అంటే రాబోయే పెద్దలను అగౌరవపరచినట్లేనని అందరూ భావిస్తారు. ఇలాంటి అంశాల్లో అన్ని వైపులనుంచీ కొంత మార్పు రావడం శ్రేయస్కరం.

2. సుదీర్ఘ ఉపోద్ఘాతాలు :

అధ్యక్ష పీఠం వహించిన వక్త వేదికపై ఆసీనులైన వారిని గురించి పరిచయ వాక్యాలతో మంచి విషయాలు ప్రసంగించడానికి ఆహ్వానించడం ఆనవాయితీ. సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకున్న వారికే ఈ హోదా దక్కుతుంది. కుప్లంగా కన్నా, కాస్త సుదీర్ఘంగానైనా వేదికపై ప్రసంగించే పెద్దల గురించి చెప్పడం మంచిదే. అయితే, కొంతమంది వ్యక్తిగత పరిచయాల ప్రస్తావనే ఎక్కువగా చేస్తారు. సభికుల మనోభావాలను ఏ మాత్రం విలువ లేకుండా సుదీర్ఘ ఉపోద్ఘాతాలు ఉంటాయి.

3. సంబోధనల పరంపర :

సహజంగా సభా నిర్వహణ, కార్యక్రమ వివరాలు, ఆహ్వానితుల వివరాలు పొందుపరచిన ఆహ్వాన పత్రిక ముద్రించడం, కొన్ని పాంప్లేట్స్‌ ప్రచురించడం, పంచడం వంటివి చేస్తారు. అయినా వేదికపై ఆసీనులైన పెద్దలందరినీ పేరు పేరునా వారి ఉద్యోగ, వ్యాపార వివరాలు సహా, ప్రతి వక్తా సంబోధించడం గౌరవ సూచికంగా భావిస్తారు. వివరాలు అప్పటికే తెలిసి ఉంటాయి. అయినా ప్రస్తావించడం అనవసరం కాకుంటే కొంత చమత్కారంతో ఆకర్షణ పెంచే ప్రయత్నం చేయొచ్చు

4. ప్రదానంలో ప్రమాదం :

చాలా సభల్లో ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకో, కళాకారులకో, విద్యార్థులకో కొంత నగదు లేదా మరో రూపంలో సాయం చేయడం తరచూ కనిపిస్తుంది. దానం గుప్తంగా చేయాలన్నది పెద్దల మాట. దానికి భిన్నంగా మైక్‌లో పదే పదే పేదవారికి సాయం, విరాళం అంటూ ప్రస్తావించడం వల్ల స్వీకర్తల మనోభావాలు ఎంతగా గాయపడతాయో కొంచెమైనా ఆలోచించాలి. స్వీకర్తల లేమిని పదే పదే సమాజానికి తెలియజేస్తూ తమ ప్రాధాన్యతను చాటుకోవడం సమర్థనీయం కాదు.

5. మీడియా కోసం ముందూ, వెనుక :

ఆలస్యంగా ప్రారంభమయ్యే సభల్లో కనిపించే మరో అవలక్షణం మర్నాడు పత్రికల్లో, దృశ్య మాధ్యమాలలో కనిపించడం కోసం నిర్ణీత సమాయానికి ముందే ఆనాటి ప్రధాన కార్యక్రమమైన ప్రదానమో, లేక పుస్తకావిష్కరణో హడావిడిగా చేసేస్తారు. మర్నాడు ప్రసార మాధ్యమాల్లో వార్త రావడం నిర్వాహకులకు ఆనందం ఇవ్వవచ్చు. కానీ సభా కార్యక్రమాలు చప్పగా సాగి, ఇక ఇక్కడ కూర్చోవడం దండగ అనే భావన ప్రేక్షకుల్లో కలిగిస్తాయి.

6. సుదీర్ఘ ఉపన్యాసాలు :

మంచి వక్తలు ఉన్న సభలకు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్న ఆసక్తితో చాలామంది తమకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి హాజరవుతారు. వారి కోసం ప్రేక్షకులు సీట్లకు అతుక్కునే ఉంటారన్న భావనతో ప్రధాన వక్తకు సహజంగా ఆఖరులో ప్రసంగించే అవకాశమిస్తారు నిర్వాహకులు. ఈ అవకాశాన్ని అతిచక్కగా దుర్వినియోగం చేసుకొని ముందు మాట్లాడే చాలామంది వక్తలు అసలు విషయం కన్నా కొసరు విషయాలు, అనవసర ప్రస్తావనలు చేస్తూ కాలాన్ని మింగేస్తారు. ఇది భరించలేనంత చిరాకు కలిగించినా, సభామర్యాదకై కూర్చొనే ఉంటారు చాలామంది ప్రేక్షకులు.

.... ఇలా ఎన్నో లోటుపాట్లు సభల్లో కన్పిస్తాయి. ఈ స్థితి మారాలి. టెలివిజన్‌ పుణ్యమా అంటూ చాలామంది ఇప్పటికే సభలకు దూరమవుతున్నారు. పెరిగిన జీవన వేగాన్ని తట్టుకుంటూ కొంతమంది, తమ జీవితంలో కొంత కాలాన్ని 'విలువలతో కూడిన విలువైన కార్యక్రమాలకు' కేటాయించే ప్రేక్షకుల కోసం సభా నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఈ ప్రపంచంలో ఎంత ఖర్చు పెట్టినా కొనలేని వాటిలో 'కాలం' ప్రథమ స్థానంలో ఉంటుంది. అటువంటి విలువైన కాలాన్ని వేదికపై ఉన్న పెద్దలు హరించడం, వృథా చేయడం అంటే వారితో పాటు సభలో ఆసీనులైన అందరి కాలాన్ని హరిస్తున్నట్లే! ఇది క్షమార్హం కాదు. అందుకే ఎవరు వచ్చినా, రాకున్నా సభలను నిర్ణయించిన సమయానికి ప్రారంభించాలి. ఇది మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ క్రమంగా అదే అందరికీ అలవాటవుతుంది.

2. వేదికపై కూర్చోబోయే పెద్దలు సైతం సమయానికి హాజరు కాగలిగితేనే కార్యక్రమాలకు ఒప్పుకోవాలి. లేదా తను రాకుండానే ప్రారంభించడానికి అంగీకరించాలి. మొహమాటానికి వస్తామని చెప్పి, అటు నిర్వాహకులకు ఇటు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడం ఏ మాత్రం సమంజసం కాదు.

3. 'సభకు నమస్కారం' ఈ ఏడక్షరాలు చాలు సభలోని వేదికపైనున్నవారికి, వేదికముందున్న వారిని సంభోధించడానికి. పేరు పేరునా ప్రణామాలు చెప్పడం అంటే నోరు తెరవని ప్ Publiture