కథలు, కవితలకు ఆహ్వానం

గురజాడ 150వ జయంతి సందర్భంగా లబ్ధప్రతిష్టులు, వర్ధమాన రచయితల మేలి కలయికగా కవితా, కథా సంకలనాలు వెలువరించాలని నిర్ణయించాం. దీనిలో రచయితలందరూ పాలుపంచుకోవాలని కోరుతున్నాం. రాతలో కథ 10 పేజీలు, కవిత రెండు పేజీల నిడివి మించకుండా ఉండాలి. రచనలు ఈనెల 15లోగా ఓపెన్‌ఫైల్‌, పిడిఎఫ్‌ రెండు రూపాల్లోనూ ఝష్ట్రఱ్‌ఱరతీaఙaఅ్‌ష్ట్రఱసతీఱరష్ట్రఅaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ కు మెయిల్‌ చేయవచ్చు. పోస్టులో పంపేవారు కె.సత్యరంజన్‌, సాహితీ స్రవంతి, కృష్ణాజిల్లా కమిటీ, 23-22-61/ఎ, నర్రావారి వీధి, సత్యనారాయణపురం, విజయవాడ చిరునామాకు పంపాలి. గురజాడ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 30, అక్టోబరు 1 తేదీల్లో విజయవాడ నగరంలో జరిపే సాహిత్య కార్యశాలలో ఈ కథా, కవితా సంకలనాల ఆవిష్కరణ ఉంటుంది. ఉత్తమ రచనలకు ప్రోత్సాహకాలుంటాయి. సామాజిక సర్వతోముఖాభివృద్ధికీ, మానవీయ వికాసానికీ దోహదపడే రచనలందించడమే ఈ సంకలనాల ఉద్దేశం.

- కె.సత్యరంజన్‌, సాహితీస్రవంతి, కృష్ణాజిల్లా కమిటీ.

తెలుగు రచయితలకు ఆహ్వానం

తెలుగుజాతికి అక్షరార్చన చేస్తున్న మహామహుల వివరాలతో ఒక సంకలనం తీసుకురావాలని 'కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌' సంకల్పించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల డైరక్టరీని విడుదల చేయాలని నిర్ణయించింది. కవిత్వం (పద్యం, గేయం, గీతం, వచన కవులు), కథ, నవల, నాటకం, సినిమా, నృత్య రూపకం, కార్టూను, విమర్శ, వ్యాసం, అనువాదం వంటి అన్ని సారస్వత రంగాల్లో కృషి చేసిన రచయితలు, సృజనశీలుర వివరాలు అన్నీ ఒకచోట చేర్చి అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే 'కిన్నెర' ఆశయం. పైన పేర్కొన్న సాహిత్య ప్రక్రియలలో కృషి చేసినవారు తమ వివరాలను, తాజా ఫొటోను జతచేసి 2012 అక్టోబరు 31వ తేదీ నాటికి అందజేయాలి.

పేరు, కలంపేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, తల్లిపేరు, జీవిత భాగస్వామి పేరు, పుట్టినతేదీ, సొంత ఊరు, వృత్తి లేదా ఉద్యోగం, తపాలా చిరునామా, ఫోన్‌ నెంబర్లు, ఈ - మెయిల్‌, రచనలు, వారి ఉత్తమ రచనల పేర్లు మూడు, పొందిన పురస్కారాలు, బిరుదుల ముఖ్యమైనవి మూడు ఉటంకిస్తూ వివరాలు, ఫొటో జతచేసి, కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, 2-2-647/77/జి16, ఎస్‌.బి.ఐ కాలనీ, బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాద్‌ - 500013 చిరునామాకు పంపాలి. అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

డాక్టర్‌ ఆర్‌.ప్రభాకరరావు

ఐపిఎస్‌ (రిటైర్డ్‌), అధ్యక్షులు.

- మద్దాలి రఘురామ్‌

కార్యదర్శి, 'కిన్నెర' సంస్థ

ఫోన్‌ : 040-27426666 సెల్‌ : 9866057777.

మెయిల్‌ : kinneraarttheatres@gmail.com

suryachandrareddy@redifmail.com