(తెలుగు ఫాంటమ్‌) పుస్తకం తరిగిపోని ఖజానా

పుస్తకం చదువుతున్నాను

చివరిపేజీ చిరునామా దొరకడం లేదు

తెలియనితనమనే పలుపు తాళ్ళను తెంచుకొని

మెదడు వికసించటం పట్టాలెక్కుతున్న సందర్భం

చివరిపేజీ చిరునామా దొరకడం లేదు

అన్వేషణ కొనసాగుతూనే ఉంది

మెదడు వికసించటం పట్టాలెక్కుతున్న సందర్భం

అలుపులేని ప్రయత్నం బాట సాగుతూనే ఉంది

అన్వేషణ కొనసాగుతూనే ఉంది

సందేహాల ముళ్ళు పుడుతున్నాయి

అలుపులేని ప్రయత్నం బాట సాగుతూనే ఉంది

ప్రేరణ విద్యుత్తయి దారి చూపుతోంది

సందేహాల ముళ్ళు పుడుతున్నాయి

వివరణలు-వ్యాఖ్యానాలు సౌకుమార్యాన్ని పెంచుతున్నాయి

ప్రేరణ విద్యుత్తయి దారి చూపుతోంది

హాలాహలాల ఆయుస్సు కొడిగట్టిపోతోంది

వివరణలు-వ్యాఖ్యానాలు సౌకుమార్యాన్ని పెంచుతున్నాయి

మెదడు పొరల్లోని కరుకుదనం కరిగిపోతున్నది

హాలాహలాల ఆయుస్సు కొడిగట్టిపోతోంది

జ్ఞానామృతం కోసం ప్రస్థానం కొనసాగుతోంది

మెదడు పొరల్లోని కరుకుదనం కరిగిపోతున్నది

కనిపించని చివరి పేజీ కనుక్కొనే ప్రయోగం జరుగుతున్నది

జ్ఞానామృతం కోసం ప్రస్థానం కొనసాగుతోంది

పుస్తకం తరిగిపోని ఖజానాగా నిలుస్తుంది

Sorry

java.lang.NullPointerException