కూటి కోసం.. కూలి కోసం వలస వెళ్తే... ఎంత కష్టం .. ఎంత నష్టం ...

కూటికోసం.. కూలి కోసం... పట్టణంలో బతుకు దామని తల్లిమాటలు చెవినపెట్టక బయలు దేరిన బాటసారికి.. .... ఎంతకష్టం. అని మహాప్రస్తానంలో 1934లో శ్రీశ్రీ 'బాటసారి' కవితలో చెప్పారు. ఆనాడు చెప్పిన పరిస్థితుల మాదిరే నేటికీ వలస కూలీలకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. అప్పులు అధికమై వలసెళ్తున్న గిరిజనులకు, దళితులకే కాదు మరెందరికో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు మన పాలకులు. దీంతో పనుల వద్ద ప్రమాదాలకు గురౌతున్నారు. అనేక ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయి. వారికి సమాజంలో మనోధైర్యం లేకుండా పోతుంది. అనేక అవస్థలు పడుతున్నారు. కారణాలేవైనా కష్టాల పాలవుతున్నది గిరిజన, దళిత కుటుంబాలే అధికం. పాలకుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల నూరేళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కనీస జాగ్రత్తలు తీసుకోనందున వందలాది కుటుంబాలు మృత్యుఒడిలోకి చేరుతున్నాయి. కనీసం నామ మాత్రంగానైనా ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితులు లేవు. దీంతో ఎన్నో కుటుంబాలు కష్టాల పాలవుతున్నాయి. బాండెడ్‌ లేబర్‌ను జిల్లా నుంచి తీసుకెళ్తున్న కాంట్రాక్టర్లు కార్మికశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే రెండు లక్షల మంది వలసెళ్లినట్లు ప్రభుత్వ సర్వేలు చెబుతున్నాయి. వలసెళ్లి మరణించిన గిరిజన కుటుంబాలపై ఈ వారం ప్రత్యేకం ....

మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వసల వెళ్లిన గిరిజనులు, దళితులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. వారిని తీసుకెళ్లిన కాంట్రాక్టర్లు ప్రమాదాల బారిన పడిన వారిని పట్టించుకోవడం లేదు. అక్కడ కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతో విగత జీవులయిన వారికుటుంబాలకు చేదోడువాదోడు లేకుండా పోతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చాక కూడా జిల్లాలో వలసలు నివారించలేకపోతున్నామంటే పాలకులు, అధికార యంత్రాంగం చెబుతున్న గాలిమాటల వెనుక సత్యమెంతో తేలిపోతోంది. జిల్లాలో వరుసగా ప్రతి యేడాదీ పదుల్లో చనిపోతున్న గిరిజనుల మృత్యువార్తలే ప్రభుత్వాల నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వెనుకబడిన జిల్లాల్లో ఉపాధి పనులు అధికంగా గుర్తించి నిత్యం పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అలాగే పనులు చేపట్టే ప్రాంతాల్లో కూలీలకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని నిబంధనలూ ఉన్నాయి. కానీ వసతుల మాటేమో గానీ పనులే లేవంటూ రోజూ వందల కొద్ది మంది పేదలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇళ్లకు తాళాలు వేసి వలసలు వెళ్తున్నారు. పండు ముసలి తల్లిదండ్రులను ఇంటి దగ్గర పిల్లలకు కాపలాగా పెట్టి వెళ్తున్న వారు తిరిగి ఎంత కాలానికి ఇంటికి వస్తారో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. జిల్లాకు చెందిన దళిత, గిరిజనులు వాపోతున్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొదుర్గు మండలం గాలిగూడెం గ్రామ పంచాయతీ నంద్యా తండాలో బిస్లావత్‌తుక్లా(48), నినావత్‌బుజ్జీబారు(28) గత కొంత కాలంగా ముంబాయికి వలసెళ్లారు.

తిండిగింజలు కరువై.. పూటగడవటం కష్టంగా ఉన్న సమయంలో కాంట్రాక్టర్ల మాయమాటలను నమ్మి ముంబయి వెళ్లిన వారు భవని నిర్మాణ పనుల్లో కూలీలుగా పని చేసేవారు. ఇక్కడ కాంట్రాక్టర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో గోడకూలీ ఇద్దరూ చనిపోయారు. దీంతో నంద్యాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరే గాకుండా.. బాలానగర్‌ మండలం రాగాపూర్‌కు చెందిన తొమ్మిది మంది పూణెకు వలసెళ్లి పనులు చేస్తుండగా.. భవనం కూలిపోయి మృతిచెందారు. అమ్రాబాద్‌ మండలం లక్ష్మాపూర్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు 2002లో ముంబాయిలో మరణించారు. మూడేళ్ల క్రితం నంద్యాతండాకు చెందిన ఉల్‌సింగ్‌ మృతి చెందాడు. ఏడు నెలల క్రితం ఇదే తండాకు చెందిన కిష్టమ్మ ముంబాయిలో పనిచేస్తూ.. గోడకూలి కాలు, చేతులు విరిగి చనిపోయింది. ముష్టిపల్లితండాకు చెందిన పాండునాయక్‌ మృతి చెందాడు. జనవరి 29న ముంబయిలో నిర్మాణ పనుల్లో గోడ కూలి నంద్యాతండాకు చెందిన బుజ్జిబాయి, తుక్లానాయక్‌ మృతి చెందారు. అదే తండాకు చెందిన బాబునాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బొంరాంస్‌పేటకు చెందిన గోవిందమ్మ, బుజ్జీబాయి మామ లక్ష్మణ్‌ సైతం మరణించారు. వలసెళ్లిన వారంతా.. తిరిగి క్షేమంగా వచ్చే పరిస్థితులు లేవని తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొందుర్గు మండలం గాలిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నంద్యాతండా సమీపంలో 33 తండాలు ఉన్నాయి. వీరంతా.. వర్షాకాలం తండాలకు వచ్చి వేసవిలో ముంబయి, పూణె, హైదరాబాద్‌ వెళ్తుంటారు. దామరగిద్దతండా, నంద్యాతండా, దుర్న్యాతండా, దాస్యాతండా, కాస్లాబాద్‌తండా, చిన్నఎల్కిచర్ల, అయోధ్యపుతండా, చిలుముబావితండాల ప్రజలు వలసెళ్తుంటారు. నంద్యాతండాలో సుమారు 35 గిరిజన కుంటుంబాలు ఉంటాయి. 200 మంది జనాభా ఉంది. ప్రతి ఇంటికి రేషన్‌కార్డు ఉన్నప్పటికీ.. వీరికి భూ సౌకర్యం లేకపోవడంతో అప్పులు తీర్చడానికి వలసలే శరణ్యమయ్యాయి. సొంత తండాలో వ్యవసాయ పనుల్లేక, ఉపాధి పనులు అందక వీరంతా వలసెళ్తున్నారు. అరకొర భూమి ఉన్నా.. వాటికి నీటి సౌకర్యం లేక పదేళ్లుగా.. Publiture