సాఫ్ట్‌ డ్రింకులు.. గుండెజబ్బులు..!

ఈనాడు సాఫ్ట్‌ డ్రింకులు పిల్లలకీ, పెద్దలకీ అతి మామూలు సరదా పానీయాలుగా మారిపోయాయి. వాటివల్ల దాహం తీరదనీ, వాటిలోని ఆమ్లం వల్ల అనేక సమస్యలు ఉద్భవిస్తాయనీ తెలిసినా, వాటి జోలికి పోవడం మానలేకపోతున్నారు ఎంతోమంది. అటువంటి సాఫ్ట్‌డ్రింకుల వల్ల వచ్చే మరో నష్టం ఇటీవలే వెలుగు చూసింది. చిన్నతనంలోనే సాఫ్ట్‌ డ్రింకులు తాగితే పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికమని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. 12 సంవత్సరాల వయస్సున్న పిల్లలపై నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని తెలియజేశాయి. బాల్యదశలో రోజుకి కనీసం ఒక సాఫ్ట్‌ డ్రింక్‌ తాగిన పిల్లల్లో వారి కంటి వెనక ఉన్న ధమనులు (రక్తాన్ని గుండె నుండి తీసుకువెళ్ళే నాళాలు) కుంచించుకున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితి అధిక రక్తపోటుకీ, హృద్రోగ అవకాశాలకీ సంకేతం.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్