ఒంట్లో నలతను చెప్పే షర్టు

త్వరలో మీరు వేసుకున్న టీ షర్టు, మీ జీన్స్‌ ప్యాంటు, చివరికి మీ లోదుస్తులు కూడా మీకు నలతగా ఉంటే ఆ విష యం మీకు తెలియజేసే రోజులు రానున్నాయి. కార్నెల్‌ యూని వర్శిటీ పరిశోధకులు ఇటలీలోని కాగ్లిఅరి యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి టెక్స్‌టైల్‌ నానో టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా నూలు పోగులకు బంగారు నానో పదార్థం, విద్యుత్‌ వాహక పాలిమర్‌ను పూసి, ఒక్కో పోగునూ ఒక్కో ట్రాన్సిస్టర్‌గా మార్చనున్నారు. అలా మార్చడం వలన నూలు వందరెట్లు వాహకత్వాన్ని సంతరించుకుంటుంది. కానీ మృదుత్వాన్ని మాత్రం కోల్పోదు. అయితే ఇది సిలికాన్‌కు సాటి కాదు. ఇటువంటి పోగులతో నేసిన వస్త్రాలు ఒక కంప్యూటర్‌ సర్క్యూట్‌ బోర్డులా పనిచేస్తాయి. ఆ వస్త్రాలు వస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని అంటున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్