కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్ - పావుకేజీ, కోడిగుడ్డు - 1, శనగపిండి - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్, అజినమోటో - చిటికెడు, నూనె - వేపడానికి సరిపడా, వెల్లుల్లి ముక్కలు - పావుస్పూన్, ఉల్లిపాయ - 1, క్యాప్సికమ్ - 1
సాస్ తయారీకి : కార్న్‌ఫ్లోర్ - 3 స్పూన్లు (పావుకప్పు నీటిలో కలిపి ఉంచాలి), వెనిగర్ - 1 1/2 స్పూన్, సోయాసాన్ - 1 చెంచా, టమాట గుజ్జు- పావుస్పూన్, ఉల్లికాడల ముక్కలు - 1 1/2 సూన్, అజినమోటో - చిటికెడు, నీరు - 1 కప్పు
వీటన్నింటినీ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి.
తయారు చేసే విధానం
ఒక బౌల్‌లో క్యాలీఫ్లవర్, ఎగ్, శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్టు, అజినమోటో వేసి బాగా కలిపాలి. అందులో కొంచెం నీరు పోసుకుని ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట సేపు పక్కన వుంచాలి.పాన్‌లో నూనె పోసి కాగిన తర్వాత క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పకోడీల్లా వేసుకోవాలి. ఒక నిమిషం సన్నని మంట మీద ఉడికించి తర్వాత మంట పెంచాలి. ఎర్రగా వేగిన తరువాత తీసి పేపర్ మీద వేయాలి(నూనె పీల్చుకోడానికి). మరో ప్యాన్‌లో 2 స్పూన్ల నూనె వేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసి ఒక నిమిషం వేపాలి. తర్వాత సాస్ మిశ్రమం వేసి కలపాలి. సన్నని మంట మీద సాస్ గట్టిపడే వరకు ఉడికించాలి. తర్వాత వేపిన క్యాలీఫ్లవర్ బాల్స్‌ని వేసి బాగా కలిపి తీసి వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి.