కావలసిన పదార్థాలు
మీల్‌మేకర్ - 100 గ్రాములు, ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4, మసాలా ముద్ద - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, నూనె - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత, కారం - తగినంత, పసుపు - చిటికెడు
తయారు చేసే విధానం
మరిగే నీళ్లులో మీల్ మేకర్ వేసి మూత పెట్టాలి. పదినిమిషాల తర్వాత నీళ్లు పిండాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేయించుకోవాలి. అందులోనే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించాలి. తర్వాత ఉడికించిన మీల్ మేకర్, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పొయ్యాలి. కూర ముద్దగా ఉడికాక దించితే చాలు.