క్యాబేజి సూపు

కావలసిన పదార్థాలు

క్యాబేజి - అరకిలో

టమాటాలు - 2

ఉల్లిపాయలు - 2

కొబ్బరి చిప్ప - 1

పచ్చిమిర్చి - 4

వేరుశనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

పుల్లటి పెరుగు - 1కప్పు

దాసిన చెక్క - చిన్న ముక్క

కొత్తిమీర - కొంచెం

తయారుచేసే పద్ధతి

లేతక్యాబేజి తీసుకుని ఆకుల కింద వలిచి శుభ్రంగా కడిగి వుంచుకోవాలి. ఈ ఆకులను సన్నగా తరగాలి. కొబ్బరికోరు తీసుకుని, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకుని వుంచుకోవాలి. వేరు శనగ గింజలు మెత్తగా దంచి వుంచుకోవాలి. అలాగే దాసిన చెక్క పొడిచేసుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో క్యాబేజి, కొబ్బరి కోరు, వేరుశనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు దాసిన చెక్కపొడి అన్నీ వేసి బాగా కలబెట్టాలి. దీన్ని ఒక పళ్లెంలోకి మార్చి సమంగా పేర్చి దానిమీద టమాటా ముక్కలను కోసి పైన పేర్చాలి. కొత్తిమీర కూడా చల్లాలి. చెంచాతో తీసుకుని తినడానికి బాగంటుంది. ఇది వండాల్సి అవసరం లేదు. పచ్చిది తింటే కరకరలాడుతూ బాగుంటుంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్