కావలసిన పదార్థాలు
వండిన బాస్మతి అన్నం - 3 కప్పులు,
బటన్ మష్రూమ్ - 200గ్రా, మధ్య రకం ఉల్లిపాయలు - 2
బిరింజాకులు - 2, దాల్చిన చెక్క - అంగుళం ముక్క
ఎండుమిర్చి - 3, నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే పద్ధతి
అన్నం వండేటప్పుడే ఉప్పు కలపండి. పుట్టగొడుగుల్ని, ఉల్లిపాయల్ని గుండ్రటి ముక్కలుగా కోసుకోండి. నెయ్యి వేడి చేసి మసాలాలన్నీ వేయండి. వేగాక పుట్టగొడుగులు, ఉల్లి ముక్కలు బంగారు రంగు వచ్చేంతవరకు వేయించి బోర్లించిన బాస్మతి అన్నంపైన గుడ్రంగా అలంకరించండి.