జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద గ్రామాలలో వృథాగ ఉన్న పురాతన బావులను పూడ్చివేయనున్నట్లు ఎంపిడిఓ దత్తాత్రేయరాజు అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో గొల్లముసలి పార్వతమ్మ, అసైన్డ్‌మెంట్ భూమిలో ఉపాధి కూలీలు చేపడుతున్న ల్యాండ్ లేవలింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలలో పురాతన కాలంలో తవ్విన బావులు ప్రజలకు ప్రమాదకరంగా మారిన్నట్లైయితే ఉపాధి హామీ పథకం క్రింద నిధులు కేటాయించి వాటిని పూడ్చడం జరుగుతుందన్నారు. అలాంటి బావులు గ్రామంలో ఉంటే గుర్తించాలని సర్పంచి సురేష్‌కు సూచించారు. కూలీ డబ్బులు జాప్యం కాకుండా ప్రతివారం వచ్చే విధంగా కృషి చేస్తామని కూలీలకు బరోసా ఇచ్చారు. 20 మంది కూలీల మాస్టర్లు పరిశీలించారు. అంతకు ముందు ఉదయం గ్రామంలో గల అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించారు. అంగన్‌వాడి పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం అందుతుందా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. పిల్లలందరు సెంటర్‌కు వచ్చే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఎంపిడిఓ వెంట ఎపిఓ అంజిరెడ్డి, సర్పంచి సురేష్ ఉన్నారు.