ఓ రైతు పొలం దగ్గరకెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధారూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రియాజ్‌హైమద్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ధారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కొటం లక్ష్మారెడ్డి(65) కుటుంబ బాధను భరించలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యలు చేసుకోవాడం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని పెద్దకోడలు వెంకటమ్మకు మామను చూస్తే చిరాకు పడుతూ ఏవేవో మాటలు అనేది ఆయనకు అన్నం పెట్టక పస్తులు ఉంచెవారు. ఈ విషయమై గ్రామంలో పంచాయతీ పెట్టగా పంచాయతీ చెప్పడానికి వచ్చిన వారికి ఎదురుగా మాట్లాడి నాకు నచ్చిన్నట్లు చేస్తా మీకెందుకని దురుసుగా మాట్లాడటంతో ఎవ్వరు తీర్పు చెప్పడానికి ముందుకు రాలేదు. ఈ బాధభరించలేక లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం తమ పొలం దగ్గరకు వెళ్లి రాత్రి 8 గంటల ప్రాంతంలో పురుగుల మందు సేవించడం జరిగింది. ఇది గమనించిన పశువుల కాపరులు అతనిని గ్రామంలోకి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.