నవాబ్‌పేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం మండల ప్రత్యేకాధికారి ఎం.రమేష్‌రెడ్డి విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. నిరుపేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. అందులో భాగంగా ప్రతి విద్యార్థికీ రెండు జతల బట్టలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులకు సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి పరిశుభ్రంగా ఉండాలన్నారు. అనంతరం మండల ఇన్‌ఛార్జి ఎంఇఓ అనంత్‌రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రాథమిక పాఠశాలల 1420 మంది విద్యార్థులకు రెండు వేల 840 దుస్తువులు వచ్చాయన్నారు. వారం రోజుల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకూ రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.