ధరల తగ్గింపులో ప్రభుత్వాలు విఫలం

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు : పొన్నాల ఉప్పలయ్య, సిఐటియు మండల కార్యదర్శి

ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో పుట్టగతులుండవు. సామాన్య ప్రజలపై అధిక భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్న ప్రభుత్వం పై ప్రజలు ఉద్యమించాలి

కాంగ్రెస్‌ పతనం ఖాయం : మునుగంటి సురేస్‌, జిల్లా బిజెపి నాయకులు

ఒకే సంవత్సరంలో 8 సార్లు పెట్రోల్‌ ధరలు పెంచిన ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ధరలను అదుపు చేయలేని చావగాని దద్దమ్మ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ధరలను నియంత్రించకపోవడం బాధాకరం.

పెంచుకుంటూ పోతే ఏట్లా? : బిందెల పరమేష్‌, ద్విచక్ర వాహనదారుడు

ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఆకాశనట్టుతుంటే, మరో వైపు పెట్రోల్‌ ధరలు పెంచడం ఎంతవరకు సబబు?అవినీతి పరులకు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై పెనుభారం మోపడం అన్యాయం.

ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి : అరిగె రాములు, టిడిపి నేత

రానున్న కాలంలో ఎన్నికల్లో అభివృద్ధి పేరుతో మరోసారి లబ్ధి పొందేందుకు ప్రయత్నించే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలి. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.

Publiture